![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 316 లో.. కావ్య, కళ్యాణ్ ఇద్దరు రాజ్ శ్వేతల స్నేహం ఎక్కడవరకు వెళ్లిందోనని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా రాజ్ లేని టైమ్ లో అతని ఫోన్ చూస్తారు. అందులో వాళ్ళ ఛాటింగ్ చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. ఏమైందని కావ్య అడుగుతుంది.
ఆ తర్వాత వాళ్ళు అంత దూరం వెళ్లినట్టు ఏం అనిపించట్లేదు.. ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావద్దని కళ్యాణ్ అంటాడు. నువ్వు ఇక నుండి ఆఫీస్ కి వెళ్లి అన్నయ్య పక్కనే ఉండని కావ్యతో కళ్యాణ్ అనగానే.. ఏ ఇంట్లో ఉన్నాను.. మీరు ఏం మాట్లాడుతున్నారని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అప్పు మళ్ళీ డెలివరీ బాయ్ గా చేరడానికి రెడీ అయి వెళ్తుంటే.. వద్దు నువ్వు కష్టపడకు నువ్వు చదువుకోమని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు చెప్తారు. కానీ నేను మీ హెల్ప్ చెయ్యాలి అనుకుంటున్నాను. నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరికే వరకు నేను ఈ జాబ్ చేస్తానని అప్పు చెప్పేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజ్ ఫోన్ కి శ్వేత కాల్ చేస్తుంది. అది కావ్య చుసి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడే రాజ్ లాక్కొని కట్ చేస్తాడు. ఎవరని కావ్య కావాలనే అడుగుతుంది. క్లయింట్ అని రాజ్ చెప్పగానే.. అలా కట్ చేస్తే ఏం అనుకోదా మీ క్లయింట్ అని కావ్య కావాలనే అడుగుతుంది. రాజ్ ఎదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత కావ్య వెళ్ళిపోయాక.. శ్వేతకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడతాడు.. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి కళ్యాణ్ వచ్చి గీజర్ పాడైంది అన్నారు కదు రిపేర్ అతన్ని ఎప్పుడు రమ్మంటారని అడుగుతాడు. ధాన్యలక్ష్మి అన్న మాటలు మనసులో పెట్టుకొని అపర్ణ వద్దని చెప్తుంది. మళ్ళీ తోడికోడళ్ల మధ్యలో చిన్నగా వార్ మొదలైయి ఏదైనా అడగాలి అనుకుంటే.. నీ కొడుకుని అడుగని ధాన్యలక్ష్మితో అపర్ణ అంటుంది. అధికారం మొత్తం నీ కొడుకు చేతిలో ఉంటే.. నా కొడుకుని ఏం అడగాలని ధటన్యలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత వాళ్ళ గొడవ ఎక్కడ వరకు వెళ్తుందో అనుకొని ఇందిరాదేవి మధ్యలో కలుగుజేసుకొని.. ఇద్దరు కోడళ్లని బయటకు తీసుకొని వెళ్లి.. ఇవి మీ మాటలు కాదు.. చెప్పుడు మాటలని.. మీరు అవే విన్నారని అర్థమవుతుందంటు ఇద్దరికి నచ్చజెప్పుతుంది. తరువాయి భాగంలో నేను డిజైనర్ గా ఆఫీస్ లో జాయిన్ అవుదామని అనుకుంటున్నానని అపర్ణని కావ్య అడుగుతుంది. వద్దు ఇంట్లో కిచెనే నీకు సెట్ అవుతుందని ధాన్యలక్ష్మి అనగానే.. నా కోడలికి ఎం చెయ్యాలో నువ్వు చెప్పనవసరం లేదంటు అపర్ణ అంటుంది. కావ్య నువ్వు రేపటి నుండి ఆఫీస్ కి వెళ్ళని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |